సీఎం జగన్ ఫైనల్ ఇన్నింగ్స్‌కు రెడీ అయ్యారా.. గడప గడపకు కార్యక్రమంపై సమీక్షలో బాంబ్ పేల్చబోతున్నారా...?

Jagan: ఏపీ సీఎం జగన్ ఫైనల్ ఇన్నింగ్స్‌కు రెడీ అయ్యారా..?

Update: 2023-09-08 11:07 GMT

సీఎం జగన్ ఫైనల్ ఇన్నింగ్స్‌కు రెడీ అయ్యారా.. గడప గడపకు కార్యక్రమంపై సమీక్షలో బాంబ్ పేల్చబోతున్నారా...?

Jagan: ఏపీ సీఎం జగన్ ఫైనల్ ఇన్నింగ్స్‌కు రెడీ అయ్యారా..? ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకోవడంతో పరిపాలన, రాజకీయపరమైన నిర్ణయాల్లో ఇంకాస్త దూకుడు పెంచబోతున్నారా...? సెప్టెంబర్ 11న అర్ధరాత్రి లండన్ నుంచి ఏపీకి రానున్న జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు...? గడప గడపకు కార్యక్రమంపై సమీక్షలో జగన్ బాంబ్ పేల్చబోతున్నారా...? పనితనం బాగాలేని ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి... ? వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించబోతున్నారా...? పరిపాలన రాజధానిని విశాఖకు మార్చుతామన్న జగన్.. అందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారా...? సెప్టెంబర్ నుంచే విశాఖకు మకాం మార్చాతా... సెప్టెంబర్ 11 తర్వాత ఏపీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పుడే ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ తీసుకునే కీలక నిర్ణయాలపై.. తాడేపల్లి వర్గాలు ఏమనుకుంటున్నాయి. వైసీపీ కేడర్ లో ఎలాంటి చర్చ జరగబోతోంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వైనాట్ 175 టార్గెట్‌గా పెట్టుకున్నారు సీఎం జగన్. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. అందుకే 175కి 175సీట్లు గెలుచుకోవాలనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న భరోసా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు దశల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. అందులో పనితనం బాగాలేని నేతలకు ఇప్పటికే పలుమార్లు జగన్ క్లాస్ పీకారు. పనితనం మార్చుకోవాలని, సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ విస్తృతంగా జనాల్లోకి వెళ్లాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. సర్వేల ఆధారంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు తెప్పించుకుని సమీక్ష నిర్వహిస్తున్నారు. జమిలి ఎన్నికల వార్తలతో ఏపీలోనూ ఈసారి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో.. ఇంకాస్త దూకుడు పెంచారు జగన్. వినాయక చవితి లోపు గడప గడపకు కార్యక్రమంపై సమీక్ష జరపనున్నట్టు తెలుస్తోంది.

151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో.. 30మంది ప్రజాప్రతినిధుల పనితీరుపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు హెచ్చరించినా.. పురోగతి సాధించని ఎమ్మెల్యేలపై ఈసారి సమీక్షలో వేటుపడే ఛాన్స్ లేకపోలేదనే చర్చ నడుస్తోంది. బాధ్యతల నుంచి వారిని తప్పించే సూచనలు కన్పిస్తున్నాయి. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చిన జగన్.. పరిపాలన రాజధాని విషయంలో ఇంకాస్త దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో విశాఖ నుంచే పరిపాలన జరపనున్నట్టు సమాచారం.

Tags:    

Similar News