YCP 3rd List: మూడో జాబితాను రిలీజ్ చేసిన వైసీపీ అధిష్టానం.. 21 స్థానాల్లో కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించిన జగన్
YCP 3rd List: సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇన్‌చార్జ్‌గా మార్చివేసి కొత్త వారికి ఛాన్స్
YCP 3rd List: మూడో జాబితాను రిలీజ్ చేసిన వైసీపీ అధిష్టానం.. 21 స్థానాల్లో కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించిన జగన్
YCP 3rd List: ఏపీలో మళ్లీ అధికారం చేపట్టే దిశగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్.. నియోజకవర్గాల్లో బలమైన ఇంఛార్జులను నియమించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జులను నియమించిన వైసీపీ బాస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మూడో లిస్టుపై సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఎట్టకేలకు ముచ్చటగా మూడో జాబితాను రిలీజ్ చేసింది వైసీపీ అధిష్టానం. ఈ సారి 21 స్థానాల్లో కొత్త ఇంఛార్జులను నియమించారు జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యేలను నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లుగా మార్చివేసి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి లిస్టును 11 మంది, రెండవ లిస్టును 27 మందితో గతంలోనే విడుదల చేసింది. వీరిలో 13 మంది సిట్టింగ్‌లను మార్చగా.. 25 నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించారు.
శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ పేరును ప్రకటించింది. ఇక.. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ, విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చిన కేశినేని నానిని ఫైనల్ చేసింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరి జయరాం, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసింది.
ఇక అసెంబ్లీ అభ్యర్థుల విషయానికొస్తే.. ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరియ విజయ, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయరాజు, రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మెట్టు గోవింద్‌రెడ్డి, దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా శివప్రసాద్‌రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయానందరెడ్డి పేర్లను ప్రకటించింది. అలాగే.. మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా నిస్సార్ అహ్మద్, రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా అమర్నాథ్‌రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షి, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సతీష్, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మురళి, సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా గురుమూర్తి, పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా జోగి రమేష్, పెడన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉప్పల రామును ఖరారు చేసింది.
ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలకు 113 నియోజకవర్గ స్థానాల్లో అభ్యర్థుల వడపోత పూర్తయింది. మిగిలిన 62 స్థానాలపై కసరత్తు కొనసాగుతుంది. పార్టీలో పని చేసి.. గతంలో ఎమ్మెల్యేలుగా చేసినవారికి.. మరోసారి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది వైసీపీ అధిష్టానం. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణలు ఫాలో అవుతూ న్యాయం చేస్తున్నారు. ఇక పూర్తిస్థాయిలో అభ‌్యర్థుల మార్పులపై కసరత్తు చివరి దశకు చేరుకున్నట్లు చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపిక ఆలస్యమవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. మరో వైపు టికెట్ రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా స్థానాలపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఒక వైపు పార్టీలో చేరికలు, మరో వైపు పార్టీకి దూరమవుతున్న కొందరు నేతలపై దృష్టి సారించింది.