"చంద్రబాబు గో బ్యాక్" అంటూ వైసీపీ నేతల ఫ్లెక్సీలు
* చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా పోస్ట
"చంద్రబాబు గో బ్యాక్" అంటూ వైసీపీ నేతల ఫ్లెక్సీలు
Chandrababu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోటా పోటీగా పోస్టర్లు వెలిశాయి. చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. చంద్రబాబు గో బ్యాక్ అనే నినాదాలతో వైసీపీ నాయకులు పోస్టర్లు అంటించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చంద్రబాబుపై వైసీపీ నేతలు పోస్టులు పెట్టారు. తాలూకా సెంటర్‌లో అర్థరాత్రి ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. అయితే వెంటనే పోలీసులు ఆ ఫ్లెక్సీలను తొలగించారు. కాగా రోడ్డుకిరువైపులా టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీల ఏర్పాటు చేసేందు సిద్ధమయ్యారు. చంద్రబాబు ఫ్లెక్సీల ఏర్పాటుపై సత్తెనపల్లి పోలీసుల ఆంక్షలు విధించారు. చంద్రబాబు పోస్టర్లు అంటించేందుకు మొదట అనుమతి ఇచ్చి ఆ తర్వాత పోలీసులు ఆంక్షలు విధించారు. ఫ్లెక్సీల ఏర్పాటు చేసేందుకు వెళ్లిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.