Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వై జంక్షన్ దగ్గర ఉద్రిక్తత
Tanuku: పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తణుకు వై జంక్షన్ దగ్గర క్రిస్మస్, న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ కూటమి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Tanuku: పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తణుకు వై జంక్షన్ దగ్గర క్రిస్మస్, న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ కూటమి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహం దగ్గర వేరే పార్టీ వాళ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని వాటిని తొలగించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగగా.. అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా మోహరించి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.