అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ పరిపాలన విభాగంలో పలువురిని మందిని బదిలీ చేశారు. అందులో కొంతమంది మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు. మరికొంత మందిని ఇతర శాఖలకు బదిలీ చేశారు. బదిలీలు, కొత్త పోస్టింగ్స్‌కు సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయి. మున్సిపల్ పరిపాలనలో సమర్థత పెంచడం, పట్టణ అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ పట్టణాల్లో కొత్త అధికారుల నియామకంతో పరిపాలనా వ్యవస్థలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
బదిలీల అయిన వారి వివరాలు
1. అనంతపురం డిప్యూటీ కమిషనర్ గా ఉన్న పావనిని పార్వతీ పురం మున్సిపల్ కమిషనర్ గా మార్చారు.
2. పార్వతీపురంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ కిషోర్ కుమార్ ను అక్కడి నుంచి సీడీఎంఏలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
3. నరసాపురం మున్సిపల్ కమిషనర్ గా ఉన్న అంజయ్యను అనంతపురం మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేసారు.
4.పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆర్ వెంకట్రామిరెడ్డిని నరసాపురం మున్సిపల్ కమిషన్ గా బదిలీ చేశారు.
5. టిడ్కో జనరల్ మేనేజర్ గా ఉన్న శారదా దేవిని తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ లో అదనపు కమిషనర్ గా బదిలీ చేశారు.
6. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సహాయ కమిషనర్ గా ఉన్న కొండయ్యను పెడన మున్సిపాలిటీ కమిషనర్ గా పంపారు.
7. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న మంజునాథ్ గౌడ్ ను ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సహాయ కమిషనర్ గా పంపారు.
8. వెయిటింగ్ లో ఉన్న డానియల్ జోసఫ్ ను చీరాల మున్సిపల్ కమిషనర్ గా పంపారు.
9. చీరాల మున్సిపల్ కమిషనర్ గా ఉన్న అబ్దుల్ రషీద్ ను సీడీఎంఏలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
10.కడప కార్పోరేషన్ శానిటరీ సూపర్ వైజర్ గా ఉన్న లక్ష్మీనారాయణను రాజంపేట మున్సిపల్ కమిషనర్ గా మార్చారు.
11.రాజంపేట మున్సిపల్ కమిషనర్ గా ఉన్న అతని కర్నూలు కార్పోరేషన్ లో శానిటరీ ఇన్ స్పెక్టర్ గా బదిలీ చేశారు.
12.భీమిలి జోనల్ కమిషనర్ గా ఉన్న ఇపినాయుడిని మథురవాడ 2 జోనల్ కమిషనర్ గా మార్చారు.
13.వెంకటగిరి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గా ఉన్న వెంకట్రామిరెడ్డిని నందికొట్కూరు కమిషనర్ గా పంపారు.
14. నందికొట్కూరులో ఉన్న ఎస్ బేబీని సీడీఎంఏలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
15.వెయిటింగ్ లో ఉన్న శ్రీధర్ ను కనిగిరి మున్సిపల్ కమిషనర్ గా పంపారు.
16. ప్రస్తుతం కనిగిరి మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న పి.కృష్ణమోహన్ రెడ్డిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD)లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.