Vangaveeti Mohana Ranga: భౌతికంగా దూరమైనా ప్రజల గుండెల్లో నిలిచారు- రాధాకృష్ణ
Vangaveeti Mohana Ranga: వంగవీటి మోహనరంగా ప్రాంతాలు, కులాలు, పార్టీలకు అతీతంగా అందరూ ఆరాధించే వ్యక్తి అని వంగవీటి రాధాకృష్ణ అన్నారు.
Vangaveeti Mohana Ranga: వంగవీటి మోహనరంగా ప్రాంతాలు, కులాలు, పార్టీలకు అతీతంగా అందరూ ఆరాధించే వ్యక్తి అని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. విజయవాడలో వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రాధాకృష్ణ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి వారు నివాళులు అర్పించారు. ఆయన భౌతికంగా దూరమైనా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు.