వైసీపీని వీడటంపై స్పష్టత ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే
వైసీపీని వీడటంపై స్పష్టత ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే వైసీపీని వీడటంపై స్పష్టత ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వరుపుల సుబ్బారావు ఆ పార్టీని వీడతారని గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీలో సరైన గౌరవం లభించడం లేదంటూ పార్టీ శ్రేణుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని సుబ్బారావు ఖండించారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని ఎట్టి పరిస్థితుల్లోను పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. తనకు రాజకీయంగా దివంగత వైఎస్ గుర్తింపునిచ్చి ప్రోత్సహించారని, ఆయన కుమారుడు జగన్ నేతృత్వంలో వైసీపీలోనే కొనసాగుతానన్నారు.
కాగా 2014 సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. అనంతరం జ్యోతుల నెహ్రు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. అయితే అక్కడ టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల ముందు తిరిగి వైసీపీలో చేరారు. ఇక ప్రత్తిపాడులో టీడీపీ నుంచి పోటీ చేసిన వరుపుల రాజా కూడా ఇటీవల టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన కూడా వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. కానీ సుబ్బారావు అయన చేరికను వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.