ఆ త్యాగయ్యకు జగన్ న్యాయం చేస్తారా!

ఆ త్యాగయ్యకు జగన్ న్యాయం చేస్తారా! ఆ త్యాగయ్యకు జగన్ న్యాయం చేస్తారా!

Update: 2019-10-05 09:34 GMT

ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించి పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు సీఎం జగన్. ఈ ఎన్నికల్లో కొంతమంది సీట్లు త్యాగాలు చేసి పార్టీ గెలుపుకోసం కష్టపడ్డారు.. వారు ముఖ్యమంత్రి జగన్ మీదే ఆశలు పెట్టుకున్నారు. అలాంటివాళ్లలో మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి కూడా ఒకరు. 2014 ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే అప్పట్లో టీడీపీలోకి రమ్మని ఆయనకు భారీ ఆఫర్లే వచ్చాయి. కానీ ఆయన మాత్రం పార్టీనే నమ్ముకున్నారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో మరోసారి సీటు కోరారు. ప్రశాంత్ కిషోర్ సర్వే పుణ్యమాని ఆయన సీటు గల్లంతయింది.

ఆ ఎన్నికల్లో జంకెను కాదని జిల్లాలో సీనియర్ నేత అయిన మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి పెద్ద కుమారుడు నాగార్జునరెడ్డికి టిక్కెట్ ఇచ్చారు జగన్.. మొదట్లో జగన్ నిర్ణయాన్ని జంకే వ్యతిరేకించినా ఆ తరువాత పార్టీ గెలుపుకోసం కష్టపడ్డారు. ఆ సమయంలో ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు జగన్. అంతేకాదు అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నా జగన్ మాత్రం జంకేపై దృష్టిసారించలేదు. జంకే కూడా అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన నేతలకే కాకుండా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన కొందరు నేతలకు పదవుల పంపకం చేస్తున్న జగన్.. జంకే కు న్యాయం చేస్తారా లేదా అన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. 

Tags:    

Similar News