Karapa: రాష్ట్ర వ్యాప్తంగా 22.30 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేస్తాం
రాష్ట్ర వ్యాప్తంగా 22.30 లక్షల మంది లబ్ధిదారులను అందరికీ ఇళ్ల పథకంలో అర్హులుగా గుర్తించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని వెల్లడించారు.
కరప: రాష్ట్ర వ్యాప్తంగా 22.30 లక్షల మంది లబ్ధిదారులను అందరికీ ఇళ్ల పథకంలో అర్హులుగా గుర్తించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని వెల్లడించారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా కరప మండలం అరటలకట్ట గ్రామంలో ఇళ్ల స్థలాలు లే అవుట్ ను సీఎస్ నీలం సహానీ జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ దాదాపు 50 శాతం పైగా ప్రభుత్వ భూములే అందుబా టులో ఉన్నాయి అని, మిగిలిన భూముల కోసం భూ సేకరణ వేగవంతం చేసినట్లు వెల్లడించారు.
మార్చి 25 వ తేదీ నాటికి అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా తూర్పుగోదావరిలో లబ్ధిదారులు అధికం గా ఉన్నారని, ఇక్కడ భూమి కూడా ఎక్కువ అవసరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి భూసేకరణ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని అభినందించారు.అర్హులు అయిన లబ్దిదార్లను ఎవరు వదలమని, ఇదే సమ యంలో అనర్హులను జాబితాలో పేర్లు చేర్చడం జరగదన్నారు. అరట్లకట్ట గ్రామంలో 6.87 ఎకరాల విస్తీర్ణంలో 311 మంది లబ్ధిదారులకు వేసిన లేఅవుట్ పరిశీలించారు.
పలువురు స్థానికులు తమకు స్థలాలు రాలేదంటూ ఫిర్యాదు చేయగా వారి అర్హత పరిశీలించి అర్హులైన జాబితాలో పేర్లు చేర్చాలని ఆదేశిం చారు. కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 170 ఎకరాల సాల్ట్ భూములు, నూట ఎనిమిది ఎకరాల పోర్ట్ భూములు తీసుకునేందుకు అనుమతి లభించిందన్నారు. 3.30 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు.
వ్యక్తిగత ఇల్లే కాకుండా జి ప్లస్ వన్, ప్లస్ టు విధానంలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నoదున 3888 ఎకరాల భూమి సరిపోతుందన్నారు. అందరికీ వ్యక్తిగత ఇళ్లు ఇవ్వాలంటే ఏడు వేల ఎకరాల భూమి అవసరం అన్నారు. లబ్ధిదారు లకు భూములు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటికే రెండు వేల ఎకరాలు సిద్ధం చేశామని, మిగిలిన భూములు భూసేకరణ తో పాటు, ల్యాండ్ పూలింగ్ లో తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు.