వాతావరణంలో పెను మార్పులు.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగురాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు సంభవించాయి. గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వాతావరణంలో చల్లగా మారిపోయింది.

Update: 2019-12-29 04:52 GMT
ప్రతీకాత్మక చిత్రం

తెలుగురాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు సంభవించాయి. గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వాతావరణంలో చల్లగా మారిపోయింది. కాగా.. బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, గాలిలో తేమ పెరగడం చేత చలి పెరగడంతో రెండు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయని విశాఖవాతావరణ శాఖ వెల్లడించింది.

త్రిపుర నుంచి ఒడిశాకు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రెండు మూడు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ పేర్కొంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నా, మేఘాల ప్రభావంతో పగలు ఉష్ణోగ్రతలు మరింత దిగజారిపోయే అవకాశం ఉంది. తేమగాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

కాగా.. దేశరాజధాని ఢిల్లీ చలితో వణికిపోయింది. ఈ సీజన్‌లో 118 ఏళ్ల తర్వాత ఢిల్లోనే అత్యంత చల్లటి వాతావరణం నమోదైందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వాయు కాలుష్యంతో అల్లడిపోయిన ఢిల్లీ ప్రజలను చలి కూడా వణికిస్తుంది. దట్టంగా అలముకున్న పొగమంచు సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగిస్తుంది. ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు సఫ్దర్‌జంగ్‌ అబ్జర్వేటరీ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్‌ కంటే మరింత దారుణంగా పడిపోయాయి. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విమానాలు, రైళ్లు, రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. లేహ్‌, ద్రాస్‌లలో మైనస్‌ 19.1డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. 


Tags:    

Similar News