Vijayawada: విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భవాని దీక్షలకు ఏర్పాట్లు
Vijayawada: దసరా ఉత్సవాల అనంతరం భవాని దీక్షలకు సిద్ధమవుతున్నారు విజయవాడ కనక దుర్గమ్మ ఆలయ అధికారులు.
Vijayawada: దసరా ఉత్సవాల అనంతరం భవాని దీక్షలకు సిద్ధమవుతున్నారు విజయవాడ కనక దుర్గమ్మ ఆలయ అధికారులు. కార్తీక మాసంలో చేపట్టే భవాని దీక్షలు డిసెంబర్ 2వ వారంలో విరమిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు స్వీకరించిన లక్షలాదిమంది భక్తులు.. గిరిప్రదక్షిణ కోసం విజయవాడకు చేరుకుంటారు. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శీను నాయక్ తెలిపారు. నూతన పాలకమండలి సభ్యులతో సమావేశంలో పాల్గొని నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు శీను నాయక్.
ఎన్నడు లేని విధంగా దసరా ఉత్సవాలకు లక్షల మంది భక్తులు తరలిరావడం సంతోషకరమన్నారు. దసరా ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి సీపీ రాధకృష్ణన్ కనక దుర్గమ్మను దర్శించుకోవడంతో ఆనందకరమన్నారు. ఉత్తరాది ప్రాంత ప్రజలు కూడా అమ్మవారి విశిష్టతలు తెలుసుకొని.. అమ్మవారి దర్శనార్ధం తరలి వస్తామనడం అభినందనీయమన్నారు. దీక్ష ఏర్పాట్లు విస్తృతస్థాయిలో చేసి... భవాని భక్తుల అభినందనలు అందుకోవడమే తమ లక్ష్యమని ఈవో తెలిపారు. కార్తీక మాసంలో నెల రోజులపాటు ప్రత్యేక పూజలతో పాటు కోటి దీపోత్సవం కూడా నిర్వహించునున్నట్లు ఆలయ ఈవో శీను నాయక్ తెలిపారు.