Vijayawada: భవానీపురంలో ఇళ్లు కూల్చివేత.. సీఎం చంద్రబాబు ఇంటికి భవానీపురం బాధితులు
Vijayawada: విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది.
Vijayawada: విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు ఆదేశాలతో 42 కుటుంబాలకు చెందిన ఇళ్లను పోలీసులు కూల్చివేశారు. ఈ క్రమంలో కాలనీవాసులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే కూల్చివేతలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
విజయవాడ భవానిపురంలో రెండున్నర దశాబ్దాల క్రితం 42 కుటుంబాలు ఒక స్థలాన్ని కొనుగోలు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. వారికి బ్యాంకు లోన్లతో పాటు నగరపాలక సంస్థ అనుమతులు కూడా ఇచ్చింది. అయితే రెండేళ్ల క్రితం ఓ ట్రస్టు కోర్టు నుంచి నోటీసులు పంపింది. ఆ స్థలం తమది అని ఖాళీ చేయాలని పేర్కొంది. ఆ 42 కుటుంబాలు కోర్టును ఆశ్రయించగా కోర్టు ఇళ్లు కూల్చేయాలని ఆదేశాలిచ్చింది. రెండు నెలల పాటు కాలనీవాసులు ఆమరణ నిరాహార దీక్షలు చేయగా ఆ తర్వాత కూల్చివేసే ప్రయత్నాలను మూకుమ్మడిగా అడ్డుకున్నారు. దాంతో మరోసారి ట్రస్టు కోర్టును ఆశ్రయించగా మరోసారి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.