టీడీపీ సీనియర్ నాయకుడు కన్నుమూత

టీడీపీ సీనియర్ నాయకుడు, తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ గొర్రెపాటి నవనీత కృష్ణ (73) మృతి చెందారు. గత కొంత కాలంగా కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో

Update: 2019-10-25 05:53 GMT

టీడీపీ సీనియర్ నాయకుడు కన్నుమూత, తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ గొర్రెపాటి నవనీత కృష్ణ (73) మృతి చెందారు. గత కొంత కాలంగా కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. సోదరుడు, గొర్రెపాటి విద్యాట్రస్ట్‌ అధినేత గొర్రెపాటి రంగనాథబాబు, తమ్ముళ్లతో కలసి నవనీతకృష్ణ అమెరికాలో స్థిరపడ్డారు. ఇరువురు గత 35 సంవత్సరాల నుండి డల్లాస్ నగరం సమీపంలో తమ తమ వృత్తుల్లో స్థిరపడ్డారు. ప్రముఖ వైద్యులుగా టెక్సాస్ రాష్ట్రంలో గుర్తింపు పొందారు. 1985 లో టీడీపీలో చేరి అమెరికాలో పార్టీ కార్యక్రమాలు చూసుకునేవారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమెరికాలో ముఖ్యమంత్రి పర్యటనలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించేవారు.

అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అభివృద్ధికి డాక్టర్ నవనీతకృష్ణ ఎనలేని సేవలు అందించారు. 2001లో తానా కోశాధికారిగా, అనంతరం ఉపాధ్యక్షుడిగా పదవులు నిర్వహించారు. 2003-05 మధ్యకాలంలో తానా అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. 2005జూలై నెలలో డాక్టర్ నవనీతకృష్ణ ఆధ్వర్యంలో డెట్రాయిట్ లో నిర్వహించిన తానా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 2007వ సంవత్సరంలో చంద్రబాబు అమెరికా పర్యటన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కు ఆక్కడి ప్రవాసాంధృల నుండి కోట్లాది రూపాయలు విరాళంగా ఇప్పించారు.

Tags:    

Similar News