Venkaiah Naidu: పాక ఇడ్లీకి ఫిదా అయిన వెంకయ్య నాయుడు..
Venkaiah Naidu: మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు తో కలిసి నేతి ఇడ్లీ తిన్న వెంకయ్య నాయుడు
Venkaiah Naidu: మున్సిపల్ ఎంప్లాయూస్ కాలనీ SSS ఇడ్లీ సెంటర్ లో.. టిఫిన్ చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Venkaiah Naidu: విజయవాడ మున్సిపల్ ఎంప్లాయూస్ కాలనీ SSS ఇడ్లీ సెంటర్ లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు టిఫిన్ చేసారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు తో కలిసి నేతి ఇడ్లీ తిన్నారు... ఈ ఇడ్లీ తినేందుకే వెంకయ్యనాయుడు గన్నవరం నుంచి ప్రత్యేకంగా విజయవాడ వచ్చారు. నాణ్యమైన ఇడ్లీ అందిస్తున్నారని హోటల్ యజమాని కృష్ణ ప్రసాద్ ను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా పాక ఇడ్లీ చాలా ఇష్టం అన్నారు.
గతంలో ఎప్పుడో ఒక్కసారి ఇక్కడ ఇడ్లీ తిన్నాను... నాణ్యమైన ఇడ్లీ తినాలనిపించి ఇక్కడకు వచ్చానన్నారు. సంప్రదాయ వంటలనే ఆహారపు అలవాట్లు గా మార్చుకోవాలన్నారు. యువత పిజ్జా, బగ్గర్లు ద్వారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని... మన వంటకాల రుచులను చూపించి అలవాటు చేయాలన్నారు. మనకు వ్యాయామం ఎంత ముఖ్యమో ..మన వంటలే తినడం కూడా అంతే ముఖ్యమన్నారు.