చంద్రబాబు అసెంబ్లీలో లేకపోవడం దురదృష్టకరం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

Update: 2020-01-21 13:33 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు టీడీపీ కేటాయించిన బెంచ్ లో కూర్చొన్న వల్లభనేని వంశీ సీటు మార్చారు. సీటు మార్చిన అనంతరం వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పక్కన కూర్చోని కాసేపు ముచ్చటించారు.

అనంతరం అసెంబ్లీలో మాట్లాడిన వల్లభనేని అమ్మఒడి గొప్ప పథకమని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 'అమ్మఒడి' పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. భుత్వ పాఠశాలలో పేద ప్రజలు, రైతులు కూలీలు పిల్లలను చదివిస్తారని, అలాంటి వారి కోసం అమ్మఒడి పథకం తెచ్చారని తెలిపారు. ఈ పథకంలో చదువుకునే సంఖ్య పెరిగిపోతుందని, నిరాక్షరాస్యత తగ్గతుందని తెలిపారు.

గొప్ప పథకాన్ని తెచ్చి రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. అమ్మఒడి పథకంపై చర్చ జరుగుతున్నప్పుడు చంద్రబాబు లేకపోవడం దురదృష్టకరమన్నారు. పేదల కోసం తెచ్చిన ఈ పథకానికి టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలపకపోవడం దారుణమని విమర్శించారు. గొప్ప పథకాన్ని తీసుకొచ్చినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలని వల్లభనేని వంశీ తెలిపారు.

వల్లభనేనే వంశీతో నవంబర్ లో టీడీపీకి రాజీనామా చేశారు. మరో ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా వైసీపీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇటివలే మద్దలి గిరి కూడా సీఎం జగన్ కలిశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రత్యేక సభ్యుడిగా గుర్తిచాలని వల్లభనేని వంశీ కోరారు. దీంతో స్పందించిన స్పీకర్ తమ్మినేని వంశీకి టీడీపీ సభ్యుల వెనుక సీటు కేటాయించిన సంగతి తెలిసిందే.

 

Tags:    

Similar News