Shivraj Singh Chouhan: విజయవాడలో కొనసాగుతున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన
Shivraj Singh Chouhan: వరద ప్రాంతాలను పరిశీలించిన శివరాజ్ సింగ్ చౌహాన్
Shivraj Singh Chouhan
Shivraj Singh Chouhan: విజయవాడలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఏపీకి చేరుకున్న చౌహాన్, మంత్రి నారా లోకేష్‌తో కలిసి వరద ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. బుడమేరు, జక్కంపూడి, కండ్రిక, అజిత్ సింగ్ నగర్‌లలో వరదలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన శివరాజ్ సింగ్ చౌహాన్.. కాసేపట్లో జక్కంపూడి కాలనీ మిల్క్ ఫ్యాక్టరీ ప్రాంతంలో బోట్లలో వెళ్లి పరిశీలిస్తారు. ఏరియల్ వ్యూ అనంతరం సీఎం నివాసానికి వెళ్లిన చౌహాన్... ప్రకాశం బ్యారేజ్‌లో దెబ్బతిన్న గేట్లను పరిశీలిస్తారు.