గ్రామోత్సవములకు గొడుగులు వితరణ
ప్రతి సంవత్సరం ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా గొడుగులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు నిర్వహించే ఉత్సవములు, గ్రామోత్సవ లలో వినియోగించుటకు అవసరమైన గొడుగులను చెన్నై వాస్తవ్యులు హిందూ ధర్మ ప్రచార సమితి ట్రస్టు సభ్యులు, దినమలర్ తమిళ దినపత్రిక చైర్మన్ ఆర్.ఆర్. గోపాల్ దేవస్థానానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా గొడుగులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ఈ గొడుగులను ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి కి ఆలయ గోపురం వద్ద విరాళంగా అందించారు. అనంతరం వీరికి ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. తిరిగి గురు దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులచే ఆశీర్వాదం తో పాటు స్వామివారి కండువా కప్పి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో మోహన్, పిఆర్వో, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.