TTD: శ్రీవారి సేవకుల కార్యక్రమంపై టీటీడీ కీలక నిర్ణయం
TTD: శ్రీవారి సేవకుల కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి టీటీడీ నిర్ణయించింది.
TTD: శ్రీవారి సేవకుల కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రస్తుతం రజతోత్సవాలు జరుపుకుంటోందని ఈవో తెలిపారు. ఈ నేపథ్యంలో సేవకులను మరింత ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దాలని సీఎం సూచించినట్లు వివరించారు. శ్రీవారి సేవకులను అడ్మినిస్ట్రేషన్‌లో భాగస్వాములను చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మార్పుల వలన శ్రీవారి సేవల్లో నాణ్యత మెరుగుపడుతుందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.