Tirupati: తిరుపతిలో మృతదేహాల కలకలం.. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు లభ్యం

Tirupati: తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.

Update: 2025-12-02 05:37 GMT

Tirupati: తిరుపతిలో మృతదేహాల కలకలం.. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు లభ్యం

Tirupati: తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. దామినేడు ఇందిరమ్మ గృహాల్లో మృతదేహాలు తీవ్ర కలకలం రేపాయి. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు తమిళనాడుకు చెందిన సత్యరాజ్‌, పొన్నాగుట్టె నాయగి, మూడేళ్ల కుమారుడు మనీష్‌గా గుర్తించారు. సత్యరాజ్‌తో పొన్నాగుట్టె నాయగి సహజీవనం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గత మూడు నెలల క్రితం గుడియాత్తం నుంచి తిరుచానూరుకు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ వీరు జీవిస్తున్నారు.

అయితే.. గత నెల 22వ తేదీ నుంచి వీరంతా బయటకు రాకపోవడంతో.. గది నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి తలుపులు తెరచి చూడగా.. లోపల మూడు మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News