ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 164.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..

Update: 2020-04-04 01:51 GMT
corona positive cases details (file photo)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మర్కజ్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం రాత్రి 10 గంటల వరకూ 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మొత్తం కేసుల్లో చాలా వరకూ డిల్లీ నుంచి వచ్చినవారే ఉండడం గమనార్హం. మొత్తం ఇప్పటివరకూ ఏపీలో 164 కేసులు నమోదు కాగా. వాటిలో 108 కేసులు మర్కజ్ వెళ్లి వచ్చిన వారు. మరో 32 మంది వారికి సన్నిహితంగా మెలిగిన వారు. ప్రభుత్వం శుక్రవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఈ విషయాలు తెలిపింది.

ఇక రాష్ట్రంలో అత్యధిక కేసులు నెల్లూరులో నమోదు అయ్యాయి. అక్కడ మొత్తం 32 పాజిటివ్ కేసులు తేలాయి. ఇందులో 8 కేసులు శుక్రవారం ఒక్కరోజే నిర్ధారణ అయ్యాయి. దీంతో జిల్లా యంత్రాంగ అప్రమత్తం అయింది. శనివారం నుంచి లాక్ డౌన్ ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..

నెల్లూరు 32

కృష్ణా 23

గుంటూరు 20

కడప 19

ప్రకాశం 17

పశ్చిమ గోదావరి 15

విశాఖపట్నం 15

తూర్పు గోదావరి 11

చిత్తూరు 9

అనంతపురం 2

కర్నూలు 1

విజయనగరం 0

శ్రీకాకుళం

Similar News