Tirumala: వాహనాలతో కిక్కిరిసిన అలిపిరి
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో తిరుపతిలో రద్దీ నెలకొంది.
Tirumala: వాహనాలతో కిక్కిరిసిన అలిపిరి
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో తిరుపతిలో రద్దీ నెలకొంది. వీక్ ఎండ్‌తో పాటు సంక్రాంతి సెలవులు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది.
ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లే వాహనాలు అలిపిరి వాహనాల తనిఖీ కేంద్రం వద్ద బారులు తీరాయి. తనిఖీలు ఆలస్యం కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి నడక మార్గంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది.
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, టీటీడీ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.