Vasireddy Padma: జగన్ వ్యాఖ్యలు 'మాడిపోయిన మసాలా దోస' లాంటివే.. వాసిరెడ్డి పద్మ సంచలన విమర్శలు!
Vasireddy Padma: రాష్ట్ర బడ్జెట్‌పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు టిడిపి నేత వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు.
Vasireddy Padma: జగన్ వ్యాఖ్యలు 'మాడిపోయిన మసాలా దోస' లాంటివే.. వాసిరెడ్డి పద్మ సంచలన విమర్శలు!
Vasireddy Padma: రాష్ట్ర బడ్జెట్‌పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు టిడిపి నేత వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. జగన్ వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయని, బడ్జెట్‌పై ఆయన చేసిన విమర్శలు సరైన సందర్భంలో లేవని ఆమె అన్నారు. “మాడిపోయిన మసాలా దోస లాగా ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు” అంటూ జగన్‌పై పద్మ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో బడ్జెట్ చర్చలు జరుగుతున్న సమయంలో కాకుండా, తీరుబడిగా తర్వాత మాట్లాడటం ఆయన రాజకీయ ధోరణిని చూపిస్తోందని పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దెబ్బతిన్నదో కాగ్ నివేదికలే చెబుతున్నాయని వాసిరెడ్డి పద్మ గుర్తుచేశారు. అప్పులు, ఆర్థిక విధ్వంసం గురించి కాగ్ నివేదికలు స్పష్టంగా ప్రస్తావించాయని అన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి అప్పులు పుట్టకూడదని లేఖలు రాస్తున్న జగన్, తన పాలనలో జరిగిన ఆర్థిక అవ్యవస్థపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అదే సమయంలో రైతులకు గిట్టుబాటు ధరలు రావడం కోసం లేదా వారి సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా లేఖలు రాశారా అని ఆమె ప్రశ్నించారు.
మహిళలపై వేధింపుల అంశంపై కూడా జగన్ చేసిన వ్యాఖ్యలను వాసిరెడ్డి పద్మ తప్పుబట్టారు. మహిళల భద్రత విషయంలో సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించడం సరైంది కాదన్నారు. జగన్ ప్రభుత్వం సమయంలో మహిళలపై జరిగిన ఘటనలపై ఆయన పార్టీ నేతలు ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కల్తీ నెయ్యి, పరకామణి అంశాలపై జగన్ మాట్లాడటం పలు అనుమానాలకు తావిస్తున్నదని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తిరుపతి వ్యవహారంపై జగన్ ఏదో దాచిపెడుతున్నట్టుగా అనిపిస్తోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమస్యలపై మాట్లాడకుండా, ఒకే అంశాన్ని పదేపదే ప్రస్తావించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు.