ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం..!

ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం..! ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం..!

Update: 2019-10-06 10:16 GMT

ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ వర్షాలు విజృంభిస్తున్నాయి. గత నెల మొత్తం అన్ని జిల్లాల్లో కుంభ వర్షం కురిసింది. తాజాగా శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతేకాదు పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కంచిలి, సోంపేట, మందస, పలాస..కర్నూలు జిల్లా ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు..అనంతపురం జిల్లా ఓబుళదేవర చెరువు, నల్లచెరువు, తలుపుల, కదిరి, గాండ్లపెంట మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎత్తు ప్రదేశాల్లో, ఎత్తైన చెట్లు కింద, బహిరంగ ప్రదేశాల్లో ఒక్కరుగా ఉండకూడదని విపత్తుల నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు కొండా ప్రాంతాల్లోని ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News