ఏపీ రాజధాని అమరావతిలో ఆందోళనలు ఆగడం లేదు. త్రివిధ రాజనుల ప్రకటనను నిరసిస్తూ నిన్నటి వరకు రోడ్డెక్కిన రైతులు జీఎన్ రావు కమిటీ నివేదికపై తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. తెల్లవారుజామునుంచే రోడ్లపైకి వచ్చిన రైతులు తమ గ్రామాల్లోకి ప్రభుత్వ వాహనాలు రాకుండా అడ్డుపడుతున్నారు. ఇదే సమయంలో రోడ్లపై టైర్లు కాల్చి తమ నిరసన తెలియజేస్తున్నారు. తమను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులు కాసేపట్లో తుళ్లూరులో మహాధర్నా నిర్వహించనున్నారు.