AP Ministers: నేడు బాధ్యతలు చేపట్టనున్న ముగ్గురు మంత్రులు

ముహూర్తం చూసుకుని బాధ్యతలు స్వీకరిస్తున్న మంత్రులు

Update: 2024-06-16 04:02 GMT

AP Ministers: నేడు బాధ్యతలు చేపట్టనున్న ముగ్గురు మంత్రులు

AP Ministers: మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన పలువురు మంత్రులు ఒక్కొక్కరిగా బాధ్యతలు చేపడుతున్నారు. నేడు సచివాలయంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రిగా.. పొంగూరి నారాయణ, వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ పదవీబాధ్యతలు చేపట్టనున్నారు. తొలుత నారాయణ పదవి బాధ్యతలు చేపట్టనుండగా.. 11 గంటలకు సత్యకుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని 5వ బ్లాకులో వైద్యారోగ్యశాఖకు ఛాంబర్ కేటాయించగా.. అందులోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags:    

Similar News