Palakonda: పాలకొండలో పోలీసుల మెరుపు దాడి!
Palakonda: మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా పాలకొండలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ నిర్వహించారు.
Palakonda: పాలకొండలో పోలీసుల మెరుపు దాడి!
Palakonda: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర D G P శ్రీ హరీష్ కుమార్ గుప్తా, IPS., గారి ఆదేశముల మేరకు ఈగల్ చీఫ్ శ్రీ ఆకే రవి కృష్ణ IPS., IG P గారి పర్యవేక్షణలో, పార్వతీపురం మన్యం జిల్లా SP. ఎస్.వి.మాధవరెడ్డి గారి ఆద్వర్యములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా తేదీ.28.03.2026 శనివారం పాలకొండ మండలం, పాలకొండ టౌన్ లో ఉన్నా ఎస్సీ రెల్లి వీధి లో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా శ్రీ M రాంబాబు, SDPO, పాలకొండ, A ప్రసాదరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పాలకొండ సర్కిల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టబడ్డాయి.
ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్‌ను సంబంధిత పాలకొండ సర్కిల్ పోలీసు అధికారులు, సిబ్బంది, స్పెషల్ టీమ్‌లు కలిసి గుర్తించిన హాట్‌స్పాట్ ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాలు, అద్దె ఇళ్లు, ఖాళీ భవనాలు, బస్ స్టాండ్లు, మరియు ఇతర అనుమానాస్పద ప్రదేశాలలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఈ కార్డన్ & సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 35 మంది పోలీసు అధికారులు & సిబ్బంది మరియు ఇద్దరు మధ్యవర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ప్రజల వివరాలు, వాహనాల వివరాలు మరియు అనుమానాస్పద వ్యక్తులపై పరిశీలన చేపట్టారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా:
మొత్తం 180 మంది వ్యక్తులను తనిఖీ చేశారు
52 వాహనాలను తనిఖీ చేశారు
సరైన పత్రాలు లేని 09 వాహనాలను గుర్తించారు
మొత్తం 09 (2 వీలర్) వాహనాలను సీజ్ చేశారు
రౌడీ షీటర్లు మరియు సస్పెక్ట్ షీట్లు ఉన్న వ్యక్తులను స్పాట్ లో పిలిపించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారికీ సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు.
ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ EAGLE టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రజలతో కలిసి “ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ” నిర్వహించి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని పూర్తిగా అరికట్టే దిశగా “ఆపరేషన్ వజ్రప్రహార్” కింద ఇలాంటి ప్రత్యేక చర్యలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.