Nandyala: నంద్యాలలో దారుణం భార్యను కాపాడబోయి అత్త బలి!
Nandyala: నంద్యాల జిల్లాలో ఘోరం జరిగింది. మద్యం మత్తులో భార్యను చంపబోయిన అల్లుడు సునీల్, అడ్డువచ్చిన అత్త కళావతిని కత్తితో పొడిచి హత్య చేశాడు.
Nandyala: నంద్యాలలో దారుణం భార్యను కాపాడబోయి అత్త బలి!
Nandyala: నంద్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ అల్లుడు, అడ్డొచ్చిన అత్తను కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
బండి ఆత్మకూరు మండలం కాడమలకాలువలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నంద్యాలలో పెయింటర్‌గా పనిచేస్తున్న సునీల్, మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య ఎస్తేర్ రాణి పై కత్తితో దాడి చేయడానికి యత్నించాడు.. భయంతో ప్రాణాలు దక్కించుకునేందుకు ఎస్తేర్ రాణి సమీపంలోని తన తల్లి కళావతి ఇంటికి పరుగులు తీసింది. ఈ క్రమంలో అడ్డుగా నిలిచిన అత్త కళావతిపై సునీల్ కత్తితో దాడి చేశాడు.
దాడిలో తీవ్రంగా గాయపడిన కళావతిని (48) వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది.
సునీల్ తరచూగా మద్యం మత్తులో భార్యతో గొడవ పడుతుండేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంటి చుట్టుపక్కల వాళ్లతో కూడా తరచూ వివాదాలు జరిగేవని తెలిపారు. సునీల్ మరియు ఎస్తేర్ రాణి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న నంద్యాల తాలూకా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు సునీల్‌ను గాలిస్తున్న పోలీసులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మద్యం మత్తులో జరిగిన ఈ దారుణ ఘటన ఒక కుటుంబాన్ని చిదిమేసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని స్థానికులు కోరుతున్నారు.