Tirupati: నాయుడుపేటలో పసుపు జెండా రెపరెపలు.. కార్యకర్తలే ముందుండి నడిపిన వేడుక!

Tirupati: తిరుపతి జిల్లా నాయుడుపేట బజారు వీధిలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం.

Update: 2026-03-29 07:27 GMT

Tirupati: నాయుడుపేటలో పసుపు జెండా రెపరెపలు.. కార్యకర్తలే ముందుండి నడిపిన వేడుక!

తిరుపతి జిల్లా: నాయుడుపేట లోని బజారు వీధిలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు నాయుడుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు, అయితే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు ఎవరూ పాల్గొనకపోయినా తెలుగుదేశం పార్టీ సామాన్య నాయకులు సామాన్య కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టా వెంకటరమణారెడ్డి మరియు వారి అనుచరులు పాల్గొని ఈ కార్యక్రమ విజయానికి దోహదపడ్డారని నాయుడుపేట ప్రజలు మాట్లాడుకుంటున్నారు, అయితే ఈ కార్యక్రమంలో కొంతమంది కౌన్సిలర్లు కొంతమంది మాజీ కౌన్సిలర్లు పాల్గొనడం గమనార్హం, తెలుగుదేశం పార్టీని నడిపే ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండదండలు ఉంటాయని అందుకే 44 సంవత్సరాలుగా తెలుగుదేశ పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్త అయిన తెలుగుదేశం పార్టీ వీడి వెళ్లలేదని తెలుగుదేశం పార్టీ వారి కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూస్తుందని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు, ముఖ్యంగా ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పరిపాలన అటు సంక్షేమంలోనూ ఇటు అభివృద్ధిలోనూ రాష్ట్రం ముందుకు వెళుతుందని అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ ఆయనకు అండగా నిలబడుతున్నారని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియపరిచరు.

Tags:    

Similar News