ఉపాధ్యాయ సంఘాల చలో విజయవాడ ఉద్రిక్తత

Vijayawada: ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Update: 2024-01-09 13:45 GMT

ఉపాధ్యాయ సంఘాల చలో విజయవాడ ఉద్రిక్తత

Vijayawada: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉపాధ్యాయ సంఘాలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ సంఘాల ఆందోళనతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులను పోలీసులు నిర్బంధించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు విజయవాడ యూటీఎఫ్ కార్యాలయం దగ్గరికి భారీగా తరలిరావడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ప్రభుత్వం 18 వేల కోట్లు ఖర్చు చేయాలనే డిమాండ్‌తో చలో విజయవాడకు పిలుపునిచ్చారు. పోలీసులు నిర్బంధించినా నిరసన తెలిపి తీరుతామంటూ ఉపాధ్యాయులు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. లెనిన్ సెంటర్, ధర్నా చౌక్ ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News