ఆ టీడీపీ సీనియర్ నేత ఇకలేరు

Update: 2019-10-24 02:21 GMT

టీడీపీ వ్యవస్థాప సభ్యుల్లో ఒకరైన బెజవాడ ఓబుల్‌రెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఓబుల్‌రెడ్డి మృతితో టీడీపీ ఓ సీనియర్‌ నేతను కోల్పోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు అనిల్‌, గౌతంరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి ఓబుల్‌రెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కాగా గత 30 ఏళ్లుగా ఓబుల్‌రెడ్డి టీడీపీలో రాష్ట్ర సీనియర్‌ నాయకుడిగా ఉన్నారు. ఓబుల్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయన పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ పార్టీ వ్యవహారాల్లో పాల్గొనడంతో పాటు రైతు పక్షపాతిగా ఓబుల్‌రెడ్డి అందరికీ సుపరిచితులు. కేంద్ర రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రైతు సమస్యలపై తనదైన శైలీలో పోరాడారు. ఆయన సోదరుడు బెజవాడ పాపిరెడ్డి ఒక పర్యాయం రాజ్యసభ్యుడిగా పనిచేశారు. 

Tags:    

Similar News