Andhra Pradesh: మండలి అవసరమా? అని సీఎం జగన్ తన తండ్రి వైఎస్సార్‌ను అడగాల్సింది

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న నిప్పులు చెరిగారు. జగన్ బెదిరింపులకు ఎవరు బెదరని తెలిపారు.

Update: 2020-01-26 14:33 GMT

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నిప్పులు కురిపించారు. శాసనమండలిని రద్దు చేస్తామన్న జగన్ ముందు మండలిలో సభ్యులుగా ఉన్న మంత్రులు చేత రాజీనామా చేయిచాలని డిమాండ్ చేశారు. వారి చేత రాజీనామా చేయిస్తే శాసనమండలి రద్దు గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం మాటలు అప్పుడు విశ్వసిస్తామని అన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ చేత రాజీనామా చేయించాల్సిన బాధ్యత వైసీపీ సర్కారుపై ఉందని తెలిపారు.

శాసనమండలి ఉంటే ప్రభుత్వ ధనం ఖర్చు అనవసరంగా ఖర్చు అవుతుందని, మండలి అవసరమా అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే బుద్ద వెంకన్న మాట్లాడుతూ.. సీఎం జగన్ ఒక ఉద్రేకంతో ఆ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. గతంలో శాసనమండలిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునరుద్ధరించారిని, మండలి అవసరమా అని జగన్ అప్పుడే వైఎస్ ను అడగాల్సిందని వ్యాఖ్యానించారు. మండలి నుంచి మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయాలని, తర్వాత మండలి రద్దుపై చర్చ మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు.

శాసనమండలిలో వైసీపీకి సభ్యులతో పాటు వారకి అనుకూలంగా ఉన్న మొత్తం 11 మందితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన వారిని, మంత్రులను అందరికి అలాగే ఉంచి మండలి రద్దు అంటూ ఎవరిని బెదిరిస్తున్నారని విమర్శించారు. మండలి రద్దు చేసే సీన్ లేదు, మీ పార్టీ కోసం ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసిన వారికి ఎమ్మెల్సీలు ఇస్తామని హామిలు ఇచ్చిన మాట వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మె్ల్సీలు ఎవరు మండలి రద్దు గురించి బయపడడం లేదని తెలిపారు.

  

Tags:    

Similar News