సమస్యలపై నిర్లక్ష్యం.. రాత్రివేళ మున్సిపల్ ఆఫీసులో నిద్రపోయిన టీడీపీ ఎమ్మెల్యే

సమస్యలపై నిర్లక్ష్యం.. రాత్రివేళ మున్సిపల్ ఆఫీసులో నిద్రపోయిన టీడీపీ ఎమ్మెల్యే సమస్యలపై నిర్లక్ష్యం.. రాత్రివేళ మున్సిపల్ ఆఫీసులో నిద్రపోయిన టీడీపీ ఎమ్మెల్యే

Update: 2019-10-12 05:57 GMT

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో MLA రామానాయుడు నిరసన చేపట్టారు. పాలకొల్లు పట్టణంలో పారిశుద్యం సరిగా లేదని.. సకాలంలో విద్యుత్ రావడంలేదని.. అసలు మంటినీటి సరఫరా కూడా జరగడం లేదని పాలకొల్లు స్పెషల్ ఆఫీసర్‌తో మాట్లాడేందుకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. ఐతే.. అక్కడ అధికారులు లేకపోవడం, మిగతా వారు కూడా సరైన విధంగా స్పందించలేదని కలెక్టర్‌కు లేఖ రాశారు. అనంతరం రోజంతా అక్కడే ఉండి నిరసన తెలిపారు. 24 గంటలైనా తన ఫిర్యాదులపై పట్టించుకునేందుకు అక్కడ ఎవరూ లేకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాత్రంతా అక్కడే నిద్రపోయి..

ఉదయాన్నే మున్సిపల్ ఆఫీస్ బయటే స్నానం చేసి నిరనస తెలిపారు. ఇంత జరిగినా అధికారులు ఎవరూ వచ్చి మాట్లాడకపోవడం బట్టి చూస్తే.. ప్రభుత్వానికి ప్రజాసమస్యల పరిష్కారంలో ఎంత చిత్తశుద్ధి లేదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యర్ధ పదార్ధాలు క్లీన్ చేయని కారణంగా డెంగీ వంటి రోగాలు ప్రబలి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆయన అన్నారు. పట్టణంలో 75 శాతం వీధి దీపాలు వెలగడం లేదని.. దాంతో పట్టణం అంధకారంగా మారిందని అన్నారు. కుళాయిల నుంచి కలుషిత నీరు సరఫరా అవుతోందని వీటన్నింటిని పరీష్కరించాలని ఆయన భీష్మించుకు కూర్చున్నారు.  

Tags:    

Similar News