టీడీపీ పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
* పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరిట మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు * స్థానిక ఎన్నికల్లో బెదిరించి ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు -చంద్రబాబు * ప్రజల ఆమోదం లేని ఏకగ్రీవాలు ఒప్పుకోం -చంద్రబాబు
Representational Image
పల్లె ప్రగతి - పంచసూత్రాల పేరిట పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. పార్టీ గుర్తులతో ఎన్నికలు జరగకపోయినా ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా మేనిఫెస్టో తీసుకొచ్చామని ఆయన అన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. స్థానిక ఎన్నికల్లో బెదిరించి ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ప్రజల ఆమోదం లేని ఏకగ్రీవాలు ఒప్పుకోమని స్పష్టం చేశారు. 20 నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేయని వైసీపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు వేయమని అడుగుతారని ప్రశ్నించారు చంద్రబాబు.