నక్కపల్లి: మండలంలోని డొంకాడ గ్రామంలో టీడీపీ నాయకుల ఆర్దిక సహాయంతో పార్టీ సీనియర్ నాయకుడు, నక్కపల్లి ఆసుపత్రి అభివృద్ది కమిటీ మాజీ చైర్మన్ కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో గురువారం కోడిగుడ్లను పంపిణీ చేశారు. సుమారు 750 కుటుంబాలు ఒక్కొక్క కుటుంబానికి 10 గుడ్ల చొప్పున అందజేశారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ... నియోజకవర్గ వ్యాప్తంగా పేదలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, మాస్కులు టీడీపీ శ్రేణులు పంచుతూ సహాయపడుతూ ఉన్నారని అన్నారు. కరోనా వ్యాధి సోకకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగడ జగదీష్, ప్రగడ మాణిక్యం, ప్రగడ గంగ, ప్రగడ బుజ్జి, జమీలు, దివాణం, బాపూజీ, శివ, దొంగబ్బాయి, సురేష్, శేషు, గణేష్, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.