పార్టీ మారనున్న టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి..

Update: 2019-10-24 02:46 GMT

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆయనను రాష్ట్ర పెద్దలు బీజేపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. బీజేపీ నాయకులు సిఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని బిజెపిలో చేరడానికి ఒప్పించినట్లు సమాచారం. ఢిల్లీలో ఇటీవల రాయలసీమ నేతల రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బిజెపిలో చేరడానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా అంగీకరించారని.. ఆయన చేరితే పార్టీ మరింత బలపడే అవకాశముందని నేతలతో అన్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ బైరెడ్డి బీజేపీలో చేరితే జాతీయస్థాయిలో కీలక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ భవితవ్యంపై దృష్టి పెట్టారు. ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరడానికి విశ్వప్రయత్నాలు చేసినా..ఆయన తమ్ముడు కుమారుడు వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఒప్పుకోకపోవడంతో చేరిక కుదరలేదు. ఈ క్రమంలో బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్టు సమాచారం. త్వరలోనే కర్నూల్ లో పెద్ద బహిరంగ సభ పెట్టి బీజేపీ కండువా కప్పుకుంటారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.  

Tags:    

Similar News