నేడు టీడీఎల్పీ సమావేశం.. చంద్రబాబు అధ్యక్షతన భేటీ

Chandrababu: సమావేశానికి హాజరుకానున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

Update: 2024-02-04 04:56 GMT

నేడు టీడీఎల్పీ సమావేశం.. చంద్రబాబు అధ్యక్షతన భేటీ

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు...నేడు అమరావతికి రానున్నారు. టీడీఎల్పీ సమావేశంలో పాల్గొననున్నారు. గత కొద్దిరోజులుగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోనే ఉండి పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. రా కదలిరా సభను కూడా వాయిదా వేసుకుని మరీ ఆయన జాబితాను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.

అయితే రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఆయన అమరావతికి రానున్నారు. ప్రజా సమప్యలపై అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు చేయాల్సిన పోరాటంపై చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కొందరు నేతలతో సమావేశమయ్యే అవకాశముంది.

Tags:    

Similar News