రుషికొండ కేసులో సుప్రీంకోర్టులో రఘురామకు ఎదురుదెబ్బ
Raghu Rama Krishna Raju: రుషికొండ కేసులో సుప్రీంకోర్టులో రఘురామకు ఎదురుదెబ్బ తగిలింది.
రుషికొండ కేసులో సుప్రీంకోర్టులో రఘురామకు ఎదురుదెబ్బ
Raghu Rama Krishna Raju: రుషికొండ కేసులో సుప్రీంకోర్టులో రఘురామకు ఎదురుదెబ్బ తగిలింది. రఘురామ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ప్రతి ఇంచు జాగాకు సుప్రీంను ఆశ్రయిస్తే ఎలా అంటూ సుప్రీం ప్రశ్నించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకు వేచిచూడాలని సుప్రీంకోర్టు పిటిషనర్‌కు సూచించింది. ఈ క్రమంలోనే పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రుషికొండలో రెండు కిలోమీటర్ల వరకు తవ్వకాలు జరిపారని సుప్రీంకోర్టుకు రఘురామకృష్ణరాజు న్యాయవాది ఫోటోలు ఇవ్వగా, జోక్యం చేసుకునేందుకు అత్యున్నత స్యాయస్థానం ఆసక్తి చూపలేదు.