తుమ్మపూడిలో తీవ్ర ఉద్రిక్తత.. లోకేశ్‌పై రాళ్ల దాడికి యత్నం.. ఎస్సై త‌ల‌కు తీవ్ర గాయం..

Tummapudi: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తమ్మపూడిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Update: 2022-04-28 14:31 GMT

తుమ్మపూడిలో తీవ్ర ఉద్రిక్తత.. లోకేశ్‌పై రాళ్ల దాడికి యత్నం.. ఎస్సై త‌ల‌కు తీవ్ర గాయం..

Tummapudi: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ రావడంతో వైసీపీ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకున్నారు. దీంతో టీడీపీ- వైసీపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. లోకేష్‌తో పాటు తమపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వారంటున్నారు టీడీపీ కార్యకర్తలు. అయితే ఘటనలో అక్కడే ఉన్న ఎస్సై తలకు గాయమయ్యింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ దాడులకు టీడీపీ నేతలు భయపడే పరిస్థితి లేదన్నారు.

గుంటూరు తమ్మపూడి ఘటన భాధాకరమన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్. ఈహత్యపై తమకు అనుమానాలున్నాయన్న ఆయన.. ఈ గ్రామం నుంచి తమ పార్టీ ప్రతినిధిని స్థానికులు గెలిపించుకున్నారన్నారు. అందుకే బాధిత కుటుంబానికి అండగా ఉండేందుకు వచ్చామన్నారు. బాధిత కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటామన్నారు. తక్షణ సాయం కింద 5లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు, మృతురాలి పిల్లల చదువుల బాధ్యత కూడా తామే తీసుకుంటామన్నారు. ఈకేసులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు లోకేష్.

Tags:    

Similar News