Srisailam Dasara Utsavams: కూష్మాండదుర్గగా దర్శనమిచ్చిన భ్రమరాంబ

Srisailam Dasara Utsavams: శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Update: 2025-09-26 06:20 GMT

Srisailam Dasara Utsavams: శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా భ్రమరాంభిక అమ్మవారు కూష్మాండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కైలాసవాహనంపై స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు.

అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేదపండితులు వేదమంత్రోత్సవాలతో మంగళ వాయిధ్యాల నడుమ దూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులు ఇచ్చారు. ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు, కేరళ చండిమేళం, కొమ్మ కోయ నృత్యం, స్వాగత నృత్యం,రాజబటుల వేషాలు, బ్యాండ్ వాయిద్యాలు,చెంచు గిరిజనుల నృత్యాలు, జానపద పగటి వేషాల ప్రదర్శన వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిద రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Tags:    

Similar News