Mantralayam: మంత్రాలయంలో అద్భుతం.. ప్రపంచంలో ఎత్తైన శ్రీరాముని పంచలోహ విగ్రహం
Mantralayam: జై శ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన పూజ
Mantralayam: మంత్రాలయంలో అద్భుతం.. ప్రపంచంలో ఎత్తైన శ్రీరాముని పంచలోహ విగ్రహం
Mantralayam: కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం సమీపంలో 108 అడుగుల శ్రీరాములని విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది... రెండేళ్లలో పూర్తయ్యేవిధంగా కార్యాచరణ చేపట్టారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది...దక్షిణ కాశీగా పేరున్న శ్రీశైలం పుణ్యక్షేత్రంతో పాటు శైవ, విష్షు క్షేత్రాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వున్నాయి... ఇక ఆధ్యాత్మిక భావన విశ్వవ్యాప్తం చేసిన రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలయంలో భక్తులకు కొంగు బంగారంగా నిలిచింది... ఇప్పుడు ఇక్కడే మరో అపూర్వ మైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది... ఇక్కడి తుంగభద్రా నదీ తీరంలో 108 అడుగుల ఎత్తు గల శ్రీరాముని విగ్రహం ఏర్పాటు కాబోతోంది...
సుమారు మూడు వందల కోట్ల రూపాయలతో ఈ భారీ రాముడు విగ్రహం మలిచేందుకు సన్నాహాలు మొదలు అయ్యాయి... శ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహం రూపుదిద్దుకోనుంది...గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం రూపొందించిన శిల్పి రామ్ వాంజీ సుతార్ స్వయంగా మంత్రాలయంలో ఏర్పాటు చేసే 108 అడుగుల శ్రీరాముని విగ్రహం మల్చనున్నారు...
మంత్రాలయంలో సమాధి అయిన రాఘవేంద్ర స్వామి శ్రీరాముని ఆరాధ్యదైవంగా భావించేవారు... ఆయన మఠానికి సుమారు కిలోమీటరు దూరంలో ఇప్పుడు రాముడి భారీ విగ్రహం ఏర్పాటు కాబోతోంది... ఇక్కడే పూర్తి రాతి కట్టడంతో రామాలయం నిర్మాణం జరుగుతుంది...దేవాలయాల నిర్మాణంలో సిద్దహస్తుడైన డాక్టర్ వేలు ఈ ఆలయ నిర్మాణం చేపట్టానున్నారు...సుమారు పది ఎకరాలలో సాగే రామాలయం నిర్మాణం అనేక ప్రముఖ దేవాలయాల స్థాయిలో ఉండబోతోంది...
మంత్రాలయంలో జై శ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం కాబోతున్న 108 అడుగుల భారీ శ్రీరాముడు విగ్రహనికి భూమి పూజ జరిగింది... ఈ కార్యక్రమానికి మాజీ ఎం పీ టీ. జీ. వెంకటేష్ తో సహా పలువురు హాజరు అయ్యారు... ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ తుంగభద్ర తీరం భారీ రాముడు కొలువు తీరటం సంతోషకరమన్నారు... విశ్వానికి శ్రీరాముడు ఆదర్శప్రాయుడని చెప్పారు... శ్రీరామ రాజ్యం ఎంత గొప్పగా ఉండేదో నేటికీ చెప్పుకునే సంప్రదాయం కొనసాగుతోందన్నారు... రామరాజ్యం అంటూ నేటికీ శ్రీరాముని గొప్పతనం చెప్పుకోవటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకొచ్చారు...
తిరుమలలోని శ్రీవారి ఆలయం, కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం,కాశీ విశ్వనాధ్ ఆలయం, భద్రినాధ్ ఆలయం ఇలా చెప్పు కుంటూ అనేక ప్రముఖ దేవాలయాలు భారత దేశంలో వున్నాయి... మంత్రాలయంలో ఇప్పుడు నిర్మించే రామాలయం కూడా వాటి సరసన నిలబడేలా నిర్వాహకులు ధార్మిక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నారు.