Boat Races in Konaseema: కోనసీమ జిల్లాల్లో కనువిందుగా పడవ పోటీలు

Boat Races in Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పడవ పోటీలు కనువిందు చేశాయి.

Update: 2025-11-27 06:28 GMT

Boat Races in Konaseema: కోనసీమ జిల్లాల్లో కనువిందుగా పడవ పోటీలు

Boat Races in Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పడవ పోటీలు కనువిందు చేశాయి. కాట్రేనికొన మండలం బలుసుతిప్పలో గోదావరిలో వలకట్ల అత్తరాల స్థలాన్ని దక్కించుకోవడానికి పడవలతో పోటీలు నిర్వహించారు. సుమారు 40 ఇంజిన్ బోట్లతో మత్స్యకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. కాట్రేనికొన మండలంలో గోదావరిలో వేటకు వెళ్లి చేపలు పట్టాలంటే మత్స్యకారులు పడవ పోటీలో పాల్గొనాల్సిందేనని ఇక్కడి రూల్. ఎవరైతే పడవ పోటీల్లో వలకట్ల స్థలం దక్కించుకుంటారో వారికి మరలా వరదలు వచ్చే వరకు గోదావరిలో చేపలు పట్టుకోవచ్చు. ఈ పోటీలు ప్రతీ ఏడాది దీపావళి అనంతరం వరదలు తగ్గిన అనంతరం నిర్వహిస్తుంటారు. 

Tags:    

Similar News