CM Jagan: ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో ప్రత్యేక భద్రత
CM Jagan: సీఎం భద్రత కోసం అడిషనల్‌గా స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్
CM Jagan: ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో ప్రత్యేక భద్రత
CM Jagan: ఏపీ సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యుల కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం 2023కు ఆమోదముద్ర పడింది. ఈ మేరకు చట్టం అమల్లోకి వచ్చినట్టుగా హోంశాఖ స్పెషల్ సెక్రటరీ హరీష్‌కుమార్ గుప్తా నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి సెక్యూరిటీ వింగ్‌తో పాటు సీఎం భద్రత కోసం అడిషనల్‌గా స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గత అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించింది.
ఇక సీఎం సహా ఆయన కుటుంబ సభ్యులకు పటిష్టమైన సెక్యూరిటీ కల్పించే విధంగా తీసుకువచ్చిన ఈ ఎస్ఎస్‌జీ గ్రూప్‌నకు ప్రత్యేక న్యాయ రక్షణ కూడా ఉండేలా చట్టంలో మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ చట్టాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమోదించటంతో ఇది అమల్లోకి వచ్చినట్టు హోంశాఖ ముఖ్యకార్యదర్శి ప్రకటించారు. ఇప్పటికే సీఎం భద్రతకు ఒక విభాగం ఉన్నప్పటికీ దానికి చట్టబద్ధత లేదు. అయితే ఎస్‌ఎస్‌జీ ద్వారా ముఖ్యమంత్రి, భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు భద్రత కల్పిస్తారు.
అటు సీఎం నివాసం వద్ద, రోడ్డు, రైలు, జల, వాయు మార్గాల్లో ప్రయాణించేటప్పుడు, నడకలోనూ వారికి భద్రత అందిస్తారు. ఏదైనా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడూ ఈ రక్షణ ఉంటుంది. ఏపీతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ నివసిస్తున్న సీఎం కుటుంబసభ్యుల భద్రత కోసం ఎస్‌ఎస్‌జీ పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్ ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో చదువుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన క్రమంలో విదేశాల్లో ఉన్న ఆ ఇద్దరికీ ప్రభుత్వ ఖర్చుతో భద్రత ఏర్పాటు చేసే అవకాశం ఉంది.