Satya Sai District: ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా సూచనలు చేసిన ఎస్ఐ భాష
సత్యసాయి జిల్లా నల్లచెరువులో ఆటో డ్రైవర్లతో ఎస్ఐ సమావేశం రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ భాష ప్రతి ఒక్కరికి సరైన వాహన పత్రాలు ఉండాలని సూచన నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు నడిపిన వారిపై కఠిన చర్యలు
Satya Sai District: ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా సూచనలు చేసిన ఎస్ఐ భాష
సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలోని ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు ఎస్ఐ భాష. కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదనీ ఎస్‌ఐ సూచించారు.
ప్రతి ఒక్కరికి సరైన వాహన పత్రాలు ఉండాలని... ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలలో ఎక్కించరాదని చెప్పారు. కదిరి నల్లచెరువు మార్గంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని... వాటిని నివారించడానికి ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ఆటోలు నడిపినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.