Nagarkurnool: పేకాట స్థావరంపై దాడి.. ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్
Nagarkurnool: పట్టుబడ్డ వారిని తప్పించే క్రమంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు
Nagarkurnool: పేకాట స్థావరంపై దాడి.. ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండల కేంద్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. తెల్కపల్లి మండల ఎస్సై వారం క్రితం పేకాట స్థావరంపై దాడి చేశారు. అయితే వారిని తప్పించే క్రమంలో డబ్బులు చేతులు మారినట్లుగా ఆరోపణలు రావడం సదరు వ్యక్తులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో.. విచారణ చేపట్టి.. నివేదిక సమర్పించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.