Scrub Typhus: పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం.. వ్యాధి లక్షణాలతో ఇద్దరు మృతి.. మరొకరికి చికిత్స
Scrub Typhus: పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వైరస్ కలకలం రేపుతోంది.
పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం.. వ్యాధి లక్షణాలతో ఇద్దరు మృతి.. మరొకరికి చికిత్స
Scrub Typhus: పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వైరస్ కలకలం రేపుతోంది. వ్యాధి లక్షణాలతో ఇద్దరు మృతి చెందిన ఘటన.. స్థానిక ప్రజలకు తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ముప్పాళ్ల మండలం రుద్రవరంలో ఓ యువతికి వైరస్ సోకింది. జ్వరం, ఒంటినొప్పులతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 20ఏళ్ల యువతి మృతి చెందింది.
రాజుపాలెం మండలం ఆర్‌ఆర్ సెంటర్‌కు చెందిన మరో మహిళ కూడా స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. 20రోజుల క్రితం వ్యాధి లక్షణాలతో వీళ్లిద్దరూ ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. మరోవైపు.. కొత్తూరులో మరో మహిళలకు కూడా స్క్రబ్ టైఫస్ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో.. ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.