Bhadrachalam: ఒక్క రూపాయికే చీర.. షాపింగ్‌మాల్‌కు ఎగబడ్డ మహిళలు
Bhadrachalam: పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన పరిస్థితులు
Bhadrachalam: ఒక్క రూపాయికే చీర.. షాపింగ్‌మాల్‌కు ఎగబడ్డ మహిళలు
Bhadrachalam: భద్రాచలం పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌కు మహిళలు భారీగా తరలివచ్చారు. వార్షికోత్సవం సందర్భంగా మహిళలకు ఒక్క రూపాయికే చీర అని మాల్ యాజమాన్యం ప్రచారం చేసింది. మొదటి 250 మంది మహిళలకు మాత్రమేనని ఈ ఆఫర్ అని ప్రకటించడంతో.. మహిళలంతా రూపాయి చీర కోసం షాపింగ్ మాల్‌కు ఎగబడ్డారు. షాప్ ఓపెన్ చేయగానే.. రూపాయి చీర తీసుకోవాలన్న ఆతృతతో ఒకరినొకరు తోసుకుంటూ పోటీపడ్డారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితులు చక్కబడ్డాయి.