Sajjala: ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటూ జనాన్ని చంద్రబాబు భయపెడుతున్నారు..
Sajjala Ramakrishna Reddy: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సరైంది కాదని మోడీ, అమిత్ షాలతో చెప్పించాలని చంద్రబాబుకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సవాల్ విసిరారు.
Sajjala: ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటూ జనాన్ని చంద్రబాబు భయపెడుతున్నారు..
Sajjala Ramakrishna Reddy: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సరైంది కాదని మోడీ, అమిత్ షాలతో చెప్పించాలని చంద్రబాబుకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సవాల్ విసిరారు. గతంలో శాసనసభలో మద్దతు తెలిపి... ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఆరోపిణలు చేయడమేంటని ఆక్షేపించారు. నీతి అయోగ్ సైతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రిఫర్ చేసిందన్నారు. ఎన్నికల ముందు విషప్రచారానికి తెరలేపారని ఎద్దేవా చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. భూ సమగ్ర సర్వే పూర్తి అయి… గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు లోకి వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.