వైఎస్‌ జగన్‌ నివాసానికి సదానందగౌడ

Update: 2019-10-24 13:34 GMT

కేంద్ర మంత్రి సదానంద గౌడ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని సందర్శించారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి తాడేపల్లిలోని జగన్ ఇంటికి విచ్చేశారు. ఈ సందర్భంగా సదానందను సత్కరించారు జగన్. అనంతరం ఏపీ సీఎం కేంద్ర మంత్రికి ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లారు మంత్రి. అంతకు ముందు సీఎం జగన్, కేంద్ర మంత్రి సదానంద గౌడ సూరంపల్లి గ్రామంలోని గన్నవరం మండలంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) ను ప్రారంభించారు. సిపెట్‌తో విద్యార్థులకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని జగన్ అన్నారు. ఏపీలో సిపెట్ ఏర్పాటుకు ప్రభుత్వం అందించిన సహకారాన్ని కేంద్ర మంత్రి సదానంద గౌడను ప్రశంసించారు జగన్. ఇటువంటి సంస్థలు దేశం మరియు రాష్ట్ర అభివృద్ధికి ,యువతలో నైపుణ్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 37 సిపెట్ కేంద్రాలు ఉన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News