Gudivada: రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
స్థానిక రైల్వే స్టేషన్ లో రోటరీ క్లబ్ నిర్వహించిన ఉచిత వైద్య పరీక్షా శిబిరానికి 97 మంది ప్రజలు తరలివచ్చి సుగర్ వ్యాధి రక్త పరీక్షలు, రక్తపోటు పరీక్షలు, బి.ఎమ్.ఐ పరీక్షలు ఉచితంగా చేయించుకున్నారు.
గుడివాడ: స్థానిక రైల్వే స్టేషన్ లో రోటరీ క్లబ్ నిర్వహించిన ఉచిత వైద్య పరీక్షా శిబిరానికి 97 మంది ప్రజలు తరలివచ్చి సుగర్ వ్యాధి రక్త పరీక్షలు, రక్తపోటు పరీక్షలు, బి.ఎమ్.ఐ పరీక్షలు ఉచితంగా చేయించుకున్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు వై.రెడ్డయ్య చౌదరి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ ఉచిత వైద్య పరీక్షా శిబిరాలను ప్రజలందరూ ఉపయోగించుకుని, తమకు ఉన్నటువంటి వ్యాధులను తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు.
పరీక్ష చేయించుకున్నవారిలో 12 మంది మధుమేహ వ్యాధిగ్రస్తులుగా గుర్తించబడ్డారు. అలాగే 10 మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు గుర్తిం చబడ్డారు. ఈ కార్యక్రమాన్ని గుడివాడ రోటరీ క్లబ్, గుడివాడ లో ఉన్న ప్రతి వార్డు లోనూ, పరిసర ప్రాంత గ్రామాలలోనూ 'నో యువర్ ఫిగర్స్' అనే కార్యక్ర మాన్ని నిర్వహించాలనే సంకల్పంతో ముందుకు వెళుతోంది.
రోటరీ క్లబ్ అధ్యక్షుడు వై.రెడ్డయ్య చౌదరి, పలువురు రొటేరియన్ లు పాల్గొన్నారు. ఈ శిబిరం మరికొన్ని రోజులు రైల్వేస్టేషన్లో కొనసాగుతుందని కావున ప్రయాణికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని క్లబ్ కార్యదర్శి టి.ఎన్.రాజశేఖర్ కోరారు.