Vuyyuru: ఉయ్యూరులో చోరీ

స్థానిక కాటూరు రోడ్డులోని ఓ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. కుటుంబీకులు ఊరెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలకు చొరబడి నగదునగలు ఎత్తు కెళ్లారు.

Update: 2020-03-12 06:51 GMT

ఉయ్యూరు: స్థానిక కాటూరు రోడ్డులోని ఓ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. కుటుంబీకులు ఊరెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలకు చొరబడి నగదునగలు ఎత్తు కెళ్లారు. ఇంటి యజమాని హబీబ్ పట్టణ పోలీసులకు అందించిన సమాచారం ప్రకారఇంట్లో బీరువాలో రూ.2.50 లక్షలు నగదు, సుమారు 20 కాసులబంగారు ఆభరణాలున్నాయి.

పోలీసు అధికారులు విజయవాడలో జరిగే ఉన్నతాధికారుల సమావేశంలో ఉన్నందునపూర్తి సమాచారం అందుబాటులో లేదు. ట్రైనీ ఏసీపీ విశ్వనాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విజయవాడనుంచి క్లూస్ విభాగం వచ్చి చోరీ జరిగిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించింది. వేలిముద్రలు సేకరించింది. డాగ్ స్క్వాడ్ వచ్చి పరిశీలించింది. పట్టణ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.



Tags:    

Similar News